జీవనశైలి ఆరోగ్య సమస్యల నుంచి బయటపడటానికి యోగాసనాలు చక్కని పరిష్కారమని నిపుణులు చెబుతుంటారు. భారత ప్రధాని నరేంద్రమోదీ కూడా మంచి ఆరోగ్యానికి యోగా సాధన అత్యంత ముఖ్యమైనదని. ఆయన తన జీవితంలో యోగాకు అత్యంత ప్రాముఖ్యత ఇస్తుంటారు. దేశ ప్రజల దానిని తమ జీవితంలో భాగం చేసుకునేలా సూచనలు చేస్తుంటారు. యోగాతో శారీరకంగా ఆరోగ్యంగా ఉన్నామన్న భావన కలుగుతుందని.. మానసికంగా ప్రశాంతంగా ఉండగలుగుతామని మోదీ చాలా సార్లు చెప్పారు. ఇక త్వరలో 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహించుకోనున్న తరుణంలో ఎక్స్ ఖాతాలో ఆయన ఓ వీడియోను షేర్ చేశారు.
ఆ వీడియో క్లిప్‌లో తాడాసనం గురించి వివరణ ఉంది. మోదీని పోలిన గ్రాఫిక్ ఇమేజ్ ఆ ఆసనం ఎలా వేయాలో చూపిస్తోంది. ఈ వీడియో షేర్ చేసిన ప్రధాని ‘‘ఇది శరీరానికి ఎంతో మంచిది. శరీర భాగాల స్థితిని ఒకక్రమంలో ఉంచడంలో ఉపకరిస్తుంది’’ అని ప్రధాని ఆ వీడియోకు క్యాప్షన్ ఇచ్చారు. ఈ ఆసనం.. శరీరాకృతిని మెరుగు పరుస్తుంది. ఛాతి భాగం, వెన్నెముకను దృఢపరుస్తుంది. ఎత్తు పెరగాలనుకునే పిల్లలకు ఇది చక్కటి ఆసనమంటారు నిపుణులు.
Tadasana is very good for the body. It will ensure more strength and better alignment. pic.twitter.com/6i5rp6CbXD
— Narendra Modi (@narendramodi) June 13, 2024