వాట్సాప్ గవర్నమెంట్ ద్వారా ప్రజల చేతిలోకి పాలన పెట్టామని చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఇవాళ ఉగాది వేడుకల్లో చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ… సెల్ఫోన్ విసనంగా మారితే ప్రమాదం ఉంటుందని హెచ్చరించారు.
అదే సెల్ఫోన్ ఆయుధంగా మలుచుకుంటే జీవితంలో మార్పు వస్తుందని కూడా తెలిపారు. కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని కోరారు. తెలుగు వాళ్లు ఉన్నంత కాలం టీడీపీ పార్టీ ఉంటుందన్నారు చంద్రబాబు. ఈ పార్టీకి నాతో సహా మనమంతా వారసులమే అంటూ వెల్లడించారు సీఎం చంద్రబాబు నాయుడు. నేను ఈ పార్టీకి కేవలం ఒక అధ్యక్షుడిని మాత్రమేనని… తెలుగుదేశం పార్టీ శాశ్వతంగా ఉండాలన్నదే నా ఆలోచన అన్నారు.