SRH ఫ్రాంచైజీ వర్సెస్ హైదరాబాద్ క్రికెట్ అసోషియేషన్ మధ్య గొడవలు ఉన్నాయని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే దీనిపై హైదరాబాద్ క్రికెట్ అసోషియేషన్ స్పందించింది. SRH ఫ్రాంచైజీ హైదరాబాద్ క్రికెట్ అసోషియేషన్ (HCA)పై చేసిన ఉచిత పాస్‌ల ఒత్తిడి ఆరోపణలు అసత్యమని HCA స్పష్టం చేసింది.
SRH ప్రతినిధి, HCA కోశాధికారికి లేఖ రాశారన్న వార్తలపై స్పందించిన HCA ఇప్పటి వరకు SRH యాజమాన్యం అధికారిక ఇ మెయిల్స్ నుంచి ఎలాంటి మెసేజ్ రాలేదని పేర్కొంది. ఇది SRH ప్రతిష్టను దెబ్బతీయడానికి చేస్తున్న దుష్ప్రచారం మాత్రమేనని, అసత్య ప్రచారాలను నమ్మవద్దని హెచ్చరించింది.హెచ్‌సీఏ-ఎస్ఆర్‌హెచ్ ప్రతిష్టను మసకబార్చేందుకు కొందరు పనిగట్టుకొని చేస్తున్న దుష్ప్రచారం ఇదన్నారు.