టనలో ఎన్టీఆర్‌ను చంద్రబాబు నాయుడు మించిపోయాడని చురకలు అంటించారు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ఈ సందర్బంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ… రాష్ట్రంలో సాధారణ మహిళలకే కాదు పదవుల్లో ఉన్నవారికి కూడా రక్షణ లేదని మండిపడ్డారు. పట్టపగలే కృష్ణా జిల్లా పరిషత్ చైర్మన్ హారికపై హత్యాయత్నం జరిగింది.

ఈ ఘోరాన్ని పోలీసులు చూస్తూ ఉన్నారు తప్ప ఆపలేదని ఆగ్రహించారు. చంద్రబాబు నాయుడు చెప్పినట్లు వినే పోలీసులకు మాత్రమే పోస్టింగులు ఇస్తున్నారన్నారు. ఆయన అరాచకాలకు సై అనకపోతే పోస్టింగులు ఇవ్వకుండా ఖాళీగా ఉంచుతున్నారు. బాబు కుట్రలకు ఎంతోమంది ఎస్పీ, డీఎస్పీ క్యాడర్ అధికారులు పోస్టింగులు లేక ఖాళీగా ఉంటున్నారని మండిపడ్డారు జగన్.