సీఎం రేవంత్ రెడ్డిపై సొంత పార్టీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పలుమార్లు చేస్తున్న వ్యాఖ్యలు సంచలనంగా మారుతున్నాయి. ఈ క్రమంలో రాజగోపాల్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ కమిటీ నోటీసులు జారీ చేసే అవకాశాలు ఉన్నట్లుగా సమాచారం అందుతోంది. ఈరోజు రాజగోపాల్ రెడ్డితో క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి సమావేశం అయిన అనంతరం రేవంత్ రెడ్డిపై చేస్తున్న విమర్శలపై క్లారిటీ ఇవ్వాలని కోరనున్నారు.

ఆ తర్వాత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని ఏం చేయాలనే దానిపై నిర్ణయం తీసుకోనున్నారు. ఇదిలా ఉండగా…. గత రెండు రోజుల నుంచి సీఎం రేవంత్ రెడ్డిపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పదేపదే తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు. కెసిఆర్ ను తిట్టడం కన్నా నువ్వు ఏమి చేసావో చెప్పు అంటూ ఓ రేంజ్ లో రెచ్చిపోయి మాట్లాడారు. దీంతో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై చర్యలు తీసుకునేందుకు కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది.