సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే ఈ కూటమిలో టీడీపీ కీలకంగా వ్యవహరించనుంది. ఒకవేళ టీడీపీ. నీతీశ్ కుమార్ ఆధ్వర్యంలోని జేడీయూ కనుగ ఇండియా కూటమికి మద్దతిస్తే ఫలితాలు తారుమారయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే ఇండియా కూటమి తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడుని సంప్రదించినట్లు వార్తలు కూడా వచ్చాయి.
అయితే ఏపీ ఎన్నికల ఫలితాలపై ఈరోజు మీడియా సమావేశం నిర్వహించిన చంద్రబాబు ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. తమ గెలుపునకు సహకరించిన కార్యకర్తలు, అభిమానులకు ధన్యవాదాలు తెలిపారు. మరోవైపు ఈ కార్యక్రమంలో మీడియా ఎన్డీఏ, ఇండియా కూటముల్లో ఎవరికి మద్దతునిస్తారనే ప్రశ్నను అడగబోయే క్రమంలో చంద్రబాబు కల్పించుకుని సమాధానం ఇచ్చారు. తాము ఎన్డీఏ కూటమితోనే ఉన్నామని, ఇవాళ ఆ కూటమి సమావేశంలో పాల్గొనడానికి దిల్లీ వెళ్తున్నామని క్లారిటీ ఇచ్చారు. దీంతో ఇండియా కూటమితో టీడీపీ చేతులు కలపనుందున్న వార్తలకు చెక్ పడినట్లయింది.