నేను పవన్ కలిస్తే భయమెందుకు..? ఉచ్చ పోసుకుంటున్నారా..? అని ఫైర్ అయ్యారు నారా చంద్రబాబు నాయుడు. విదేశీ విద్య ఎందుకు ఎత్తేశారో.. పెట్టుబడులు ఎందుకు రావడం లేదో సమాధానం చెప్పగలరా..? జరిగిన తప్పిదాలపై సమాధానాలు చెప్పమంటే వెన్నుపోటు అంటూ నన్ను విమర్శిస్తూ ఆవు కథ చెబుతారని ఆగ్రహించారు.
ఎవ్వడికవ్వాలి ఆవు కథ… ఏపీని ఈ విధంగా చేసి.. పైగా స్టిక్కర్లు వేస్తారా..?6093 అని మీ మొహల మీద స్టిక్కర్లు వేసుకోండన్నారు. ద్విచక్ర వాహానాలు కొనుగోళ్లు పడిపోయాయని.. కోనుగోలు శక్తి పడిపోయిందని పేర్కొన్నారు. ఇప్పుడు లూటీలు ఎక్కువ అవుతాయి… పోలవరాన్ని నాశనం చేశారు… డయాఫ్రం వాల్ దెబ్బతినడానికి కారణం జగన్ ప్రభుత్వమేనని నివేదికిస్తే.. మాపై విమర్శలు చేస్తున్నారని తెలిపారు. ఐదేళ్ల క్రితం నేను చేసిన శంకుస్థాపనలకు మళ్లీ శంకుస్థాపనలు చేస్తున్నారు… మళ్లీ మీ బిడ్డ వచ్చి ప్రారంభిస్తాడట.. మళ్లీ వస్తాడా ఈ బిడ్డ అన్నారు చంద్రబాబు. జగన్ బిడ్డ కాదు.. క్యాన్సర్ గడ్డ…ఏమన్నా అంటే.. కులాల పేర్లతో తిట్టిస్తారని ఫైర్ అయ్యారు.