బ్రిటన్ రాజుగా ఇవాళ కింగ్ర్లె ఛార్లెస్-3కి పట్టాభిషేకం నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ వేడుకను క్రైస్తవ సంప్రదాయంలో జరపనున్నారు. బ్రిటీష్ సామ్రాజ్యానికి రాజుగా బాధ్యతలు చేపట్టిన కింగ్ ఛార్లెస్‌కు ఇవాళ అధికారికంగా కిరీటాలు తొడగనున్నారు. వెస్ట్‌మినిస్టర్ అబే లో జరిగే ఆ వేడుకలో ఆయనకు రెండు కిరీటాలను తొడుగుతారు. ఆ కిరీటాలు ఏంటంటే..?
సెయింట్ ఎడ్వర్డ్స్ క్రౌన్.. కింగ్ చార్లెస్ ధరించే తొలి కిరీటం సెయింట్ ఎడ్వర్డ్స్ క్రౌన్. పట్టాభిషేక సమయంలో క్యాంటర్‌బరీకి చెందిన ఆర్చ్‌బిషప్ ఈ కిరీటాన్ని చార్లెస్ శిరస్సుకు తొడగనున్నారు. కింగ్ చార్లెస్-2 కోసం ఆ కిరీటాన్ని 1661లో తయారు చేశారు. మధ్య యుగానికి ప్రతీకగా నిలిచేందుకు ఆ కిరీటాన్ని 1649లో కరగదీసి కొత్త కిరీటంగా రూపొందించారు. ఆ కిరీటం బరువు 2.2 కేజీలు ఉంటుంది. పూర్తిగా బంగారంతో తయారు చేశారు.
ఇంపీరియల్ స్టేట్ క్రౌన్.. పట్టాభిషేక మహోత్సవం ముగింపు సమయంలో.. సెయింట్ ఎడ్వర్డ్స్ క్రౌన్ స్థానంలో తక్కువ బరువు ఉండే లైటర్ ఇంపీరియల్ స్టేట్ కరీటాన్ని ధరిస్తారు. ఇంపీరియల్ స్టేట్ క్రౌన్‌ను ప్రభుత్వ కార్యక్రమాల్లో వాడుతుంటారు. పార్లమెంట్ ఓపెనింగ్ సమయంలో ఈ కిరీటాన్నే ధరిస్తారు. ఈ కిరీటం బరువు 1.06 కేజీలు. 31.5 సెంటీమీటర్ల ఎత్తు ఉంటుంది.