చంద్రబాబు పిటిషన్‌పై నేడు సుప్రీంకోర్టులో విచారణ

-

స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అరెస్టయిన విషయం తెలిసిందే. చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ.. ఓవైపు ఆయన కుటుంబ సభ్యులు, మరోవైపు టీడీపీ శ్రేణులు ఆందోళనలకు దిగుతున్నారు. బాబును అక్రమంగా అరెస్టు చేశారంటూ వైసీపీ ప్రభుత్వంపై నిప్పులు చెరుగుతున్నారు. ప్రస్తుతం రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో ఉన్న బాబును వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

మరోవైపు చంద్రబాబు ఇప్పటికే బెయిల్ క్వాష్ పిటిషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే బాబుకు బెయిల్ పిటిషన్ నిరాకరిస్తూ ఏపీ హైకోర్టు షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇక.. స్కిల్ డెవలప్​మెంట్ కేసులో తనపై పెట్టిన కేసు కొట్టివేయాలని కోరుతూ సుప్రీం కోర్టులో చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్‌ పిటిషన్‌పై నేడు విచారణ జరగనుంది. గవర్నర్‌ ముందస్తు అనుమతి లేకుండానే తనపై పెట్టిన కేసు కొట్టివేయాలంటూ ఆయన అత్యున్నత న్యాయస్థానంలో చంద్రబాబు పిటిషన్‌ పిటిషన్ దాఖలు చేశారు. సుప్రీంకోర్టులోని 6వ నెంబర్‌ కోర్టులో ఐటెం నెంబర్ 63 కింద లిస్టయిన ఈ కేసును ఇవాళ జ్సిటస్ అనిరుద్దబోస్‌, జస్టిస్ బేలా ఎం.త్రివేదిలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారించనుంది.

Read more RELATED
Recommended to you

Latest news