నేడు హైదరాబాద్‌కు రానున్న కేంద్ర ఎన్నికల సంఘం బృందం

-

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల హడావుడి షురూ అయింది. ఓవైపు ప్రధాన పార్టీలు ఈ ఎన్నికల్లో గెలిచేందుకు తమ వ్యూహాలకు పదును పెడుతోంటే.. మరోవైపు ఎన్నికల సంఘం ఎన్నికల నిర్వహణపై కసరత్తు చేస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఎన్నికల ప్రణాళిక, ఏర్పాట్లను కేంద్ర ఎన్నికల సంఘం పూర్తి స్థాయిలో సమీక్షించనుంది. ఇందుకోసం మూడ్రోజుల పాటు హైదరాబాద్​లో పర్యటించనుంది. ఇందులో భాగంగా ఇవాళ నగరానికి కేంద్ర ఎన్నికల సంఘం రానుంది.

మూడు రోజుల పాటు హైదరాబాద్  పర్యటనలో రాజకీయ పార్టీలు, ఎన్నికల అధికారులతో ఈసీ బృందం సమావేశం కానుంది. త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల సన్నద్ధత, సన్నాహకాలను సమీక్షించడంతో పాటు ప్రలోభాల కట్టడిపై ఈసీ అధికారులు ప్రధానంగా దృష్టి సారించనున్నారు. మూడు రోజుల పర్యటన అనంతరం ఎన్నికల నిర్వహణా తేదీలపై ఈసీ ఓ అంచనాకు వచ్చే అవకాశం ఉంది. ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ నేతృత్వంలోని పూర్తి స్థాయి ఈసీ బృందం మూడు రోజుల పాటు తాజ్ కృష్ణా హోటల్​లో బస చేయనుంది.

ఇవాళ గుర్తింపు పొందిన పది రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం అవుతుంది. ఎన్నికల నిర్వహణ, ఏర్పాట్లకు సంబంధించి వారి నుంచి సలహాలు, సూచనలు, అభ్యంతరాలు స్వీకరిస్తారు. అనంతరం ఎన్ ఫోర్స్ మెంట్ ఏజెన్సీలతో ఈసీ బృందం భేటీ అయి.. ఎన్నికల్లో డబ్బు, మద్యం, ఉచిత కానుకల ప్రభావానికి అడ్డుకట్ట వేసేలా ఈసీ చర్యలు తీసుకుంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news