16న చంద్రబాబు స్కిల్ డెవలప్ మెంట్ కేసు తీర్పు

-

టీడీపీ అధినేత చంద్రబాబు స్కిల్ డెవలప్ మెంట్ కేసులో జైలుకు వెళ్లిన విషయం తెలిసిందే. అయితే ఇవాళ సీఐడీ కార్యాలయానికి వెళ్లారు చంద్రబాబు. అక్కడ కేసుకు సంబంధించి కొన్ని సంతకాలు చేయాల్సి ఉండగా.. సంతకాలు చేసి వచ్చారు. చంద్రబాబు వస్తున్నాడని తెలుసుకొని అభిమానులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున సీఐడీ కార్యాలయం వద్దకు చేరుకున్నారు.

16వ తేదీన చంద్రబాబు స్కిల్ డెవలప్ మెంట్ కేసులో తీర్పు వెల్లడి కానుంది. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో ఎఫ్ఐఆర్ రద్దు చేయాలంటూ సుప్రీంలో పిటీషన్ దాఖలు చేశారు చంద్రబాబు.చంద్రబాబు 17(ఏ) పై దాఖలు చేసిన పిటీషన్ పై మంగళవారం తీర్పు ఇవ్వనున్నట్టు  సుప్రీంకోర్టు తెలిపింది. తీర్పు ఇవ్వనున్న జస్టిస్ అనిరుద్ద్ బోస్, జస్టిస్ బేలా త్రివేదీల ధర్మాసనం. అక్టోబర్ 20న తుది విచారణ జరిపి తీర్పును వాయిదా వేసింది సుప్రీం ధర్మాసనం. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో ఎఫ్ ఐ ఆర్ రద్దు చేయాలంటూ సుప్రీంలో చంద్రబాబు పిటీషన్. 17 ఏ ప్రకారం గవర్నర్ ముందస్తు అనుమతి లేకుండా కేసు నమోదు చేయడం కుదరదని పిటీషన్ లో పేర్కొన్న చంద్రబాబు.

Read more RELATED
Recommended to you

Latest news