చంద్రబాబుకు బెయిల్‌..ఈ షరతులు పాటించాల్సిందే

-

ఏపీ స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ వచ్చింది. నాలుగు వారాల పాటు చంద్రబాబు నాయుడుకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది హైకోర్టు.
కేవలం చంద్రబాబు ఆరోగ్య కారణాల దృష్ట్యా బెయిల్ మంజూరు చేసింది కోర్టు. నవంబర్ 24 వరకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.

chandrababu

నవంబర్‌ 24న సరండర్‌ కావాలని ఆదేశాలు జారీ చేసింది కోర్టు. నవంబర్ 10న మెయిన్ బెయిల్ పిటిషన్‌పై వాదనలు వింటామన్న కోర్టు… ఆస్పత్రి మినహా మరే ఇతర కార్యక్రమాల్లో పాల్గొన కూడదని షరతులు పెట్టింది. ఫోన్‌లో మాట్లాడకూడదంటూ హై కోర్టు ఆదేశాలు జారీ చేసింది. మీడియా, రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొనకూడదన్న హై కోర్టు..నాలుగు వారాల పాటు చంద్రబాబు నాయుడు లొంగిపోవాలని కోరింది. ఇక ఇవాళ సాయంత్రం 5 – 7 గంటల మధ్య చంద్రబాబు విడుదల కానున్నారు.కాగా 52 రోజుల కిందట చంద్రబాబు నాయుడు అరెస్ట్‌ అయిన సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version