మార్చిలో కేవలం పదిలోపు కేసులు మాత్రమే ఉన్న సమయంలో.. ఏపీలో కరోనా పేరు చెప్పి అర్ధాంతరంగా ఎన్నికలను వాయిదా వేశారు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్. పోనీలేండి ఆయన ముందుజాగ్రత్త అంత గొప్పది అనుకుందామనుకుంటే… ఇపుడు రోజుకు మూడున్నర వేల కేసులు నమోదు అవుతూంటే ఎన్నికలు నిర్వహించడానికి తయారవుతున్నారు. అది టీడీపీని ఇరికించడమే అంటున్నారు విశ్లేషకులు!
పైకి మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారే తప్ప.. నిజంగా ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే టీడీపీకి ఒరిగేది ఏమీ లేదు! 2019 ఎన్నికలు పూర్తయిన తర్వాత కొత్తగా ఆ పార్టీకి వచ్చేసిన బలం కూడా లేదు! కాదంటే ఒకరిద్దరు జైలుకెళ్లి రావడం తప్ప. మరి ఈ పరిస్తితుల్లో జగన్ వద్దంటున్నారు కాబట్టి… స్థానిక సంస్థల ఎన్నికలకు టీడీపీ నేతలు సై అంటున్నారా… లేక నిమ్మగడ్డ ఇచ్చిన భరోసాతో సై అంటున్నారా? అనేది సగటు కార్యకర్తలకు అర్ధం కావడం లేదు!
చంద్రబాబు అధికారంలో ఉండగా… స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టాల్సిన సమయం ఎంతో ఉన్నా, వచ్చినా కూడా నాడున్న ఎన్నికల భయంతో ఆపని పూర్తిచేయలేకపోయారు! అయితే ఇప్పుడు మాత్రం 2019 చావుదెబ్బ నుంచి తేరుకున్నట్లు.. జనాలకు తమపై మళ్లీ నమ్మకం వచ్చినట్లు ఎన్నికలకు సై సై అంటూన్నారు. అయితే… ప్రస్తుతం టీడీపీ పరిస్తితి నిమ్మగడ్డకు తెలియంది కాదు. అయినా కూడా ఎన్నికలకు సై అంటున్నారంటే… బాబుకు – నిమ్మగడ్డకూ చెడిందా అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి!!
ఇప్పుడు ఏపీలో టీడీపీ ఎంత బలహీనంగా ఉందో జగన్ కి తెలియంది కాదు. అదే సమయంలో జగన్ కు సామాన్యుల్లో ఎంత మంచి ఇది ఉందో తెలియంది కాదు. ఈ పరిస్థితుల్లో నిమ్మగడ్డపై కోపమో, నిమ్మగడ్డ ప్రవర్తనపై పూర్తి నమ్మకమో తెలియదు కానీ… స్థానిక సంస్థల ఎన్నికలకు జగన్ నై నై అంటున్నారు. అయితే అలా అనడం టీడీపీని కాపాడటమే అనేది ఒక విశ్లేషణ! అలా కాకుండా సై సై అంటే… కచ్చితంగా బాబుని ఇరికించినట్లే!
ఇక్కడ గమనించాల్సిన మరో విషయం ఏమిటంటే… నిజంగా టీడీపీకి – నిమ్మగడ్డకూ చెడలేదు అని ఆలోచిస్తే… ఈ సమయంలో నిమ్మగడ్డను ఒంటరిగా వదిలేయడం ఏమాత్రం మంచిది కాదని టీడీపీ కూడా ఎన్నికలకు సై అంటుంది తప్ప.. నిజంగా వారికి మాత్రం లోపల వణికిపోవడం లేదా? ఈ మేకపోతు గాంభిర్యాన్ని జగన్ కూడా అర్ధం చేసుకుని.. స్థానిక సంస్థల ఎన్నికలకు సై సై అంటే… అటు నిమ్మగడ్డ ఆనందం, ఇటు టీడీపీ సరదా రెండూ ఒకేసారి తీరిపోతాయనేది నెటిజన్ల సూచన! మరి జగన్ ఈ సూచన పాటిస్తారా లేక ఇలా టీడీపీని కాపాడుతూనే ఉంటారా అనేది వేచి చూడాలి!