చిరిగిన డబ్బు నోట్లు ఉన్నాయా..? ఇక డోంట్ వర్రీ.. ఆర్బిఐ కొత్త మార్గదర్శకాలు..!

-

మీ వద్ద పాతబడిపోయిన లేదా చిరిగిపోయిన డబ్బు నోట్లు ఉన్నాయా..? 10 రూపాయిలు నోటు అయిన 2000 నోటు అయిన సరే ఉన్నాయా..? అయితే అటువంటి నోట్లను ఏ షాపు యజమాని తీసుకోవడం లేదని చింతిస్తున్నారా…? ఇక అలా చింతించడం మానేయండి. ఎందుకంటే ఇప్పుడు మీరు ఈ నోట్లను ఐజీగా మార్చకోవచ్చు. అది ఎలానో తెలుసుకోండి.. చిరిగినా.. అలాగే పాత బడిపోయిన, నలిగిపోయిన నోట్లను ఎలా మార్చుకోవాలో అని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక మార్గదర్శకాన్ని జారీ చేసింది. ఈ మార్గదర్శకాలను అనుసరించి వినియోగదారులు బ్యాంకుకు వెళ్లి అలాంటి నోట్లను సులభంగా మార్చవచ్చు. ఇప్పుడు పాత నోట్లను ఎలా మార్చుకోవాలో తెలుసుకోండి.

RBI

ముందుగా మీ దగ్గర చినిగిన, పాత నోట్లు ఉంటే బ్యాంకుకు తీసుకుని వెళ్ళండి. మీ నోటును రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిబంధనల ప్రకారం బ్యాంకు అధికారి తనిఖీ చేస్తాడు. అయితే ప్రతి బ్యాంకులో కూడా పాత, చిరిగిన లేదా ముడుచుకున్న నోట్లు చెల్లుతాయి. దీని కోసం బ్యాంకులో ఎటువంటి రుసుము వసూలు చేయరు. అలాగే, మీరు ఆ ​​బ్యాంకు కస్టమర్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు. అయితే మార్చడానికి ముందు బ్యాంక్ నోటు పరిస్థితిని తనిఖీ చేస్తుంది. నోటు మారుతుందా లేదా అనేది బ్యాంకు అధికారి నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. అయితే నిబంధనలకు వ్యతిరేకంగా నోటు ఉంటే ఆ నోటును తీసుకోమని ఏ వినియోగదారుడు కూడా బ్యాంకును బలవంతం చేయకూడదు. గొడవ చేయకూడదు. బ్యాంక్ నోట్ తీసుకునేటప్పుడు, బ్యాంకు సిబ్బంది ఆ నోట్ స్థితిని పరిశీలిస్తాడు. ఆ నోటు ఉద్దేశపూర్వకంగా చిరిగిపోయిందో లేదో అన్నది తనిఖీ చేయడం జరుగుతుంది. ఇది కాకుండా, నోట్ పరిస్థితి ఎలా ఉందని బేరీజు వేసుకొని, బ్యాంకు దాన్ని మారుస్తుంది. అయితే నోట్ నకిలీది కాకుండా ఉండాలి, అలాగే నోటు పరిస్థితి కొంచెం మెరుగ్గా ఉంటే, బ్యాంక్ దానిని సులభంగా మారుస్తుంది. కానీ, నోటు పరిస్థితి బాగాలేక పోతే మాత్రం బ్యాంకు తిరిగి తీసుకోదు. ఎటువంటి నోట్లను బ్యాంకు తీసుకోదో కూడా తెలుసుకోండి.

ఆర్‌బిఐ నిబంధనల ప్రకారం నోటు బాగా చెడుగా ఉన్న అంటే బాగా మచ్చలు పడి ఉన్నాగాని, బాగా కాలిపోయిన గాని, నోటు బాగా చిరిగిపోయి ముక్కలు ముక్కలుగా ఉన్న నోట్ల విషయంలో నోట్లను మార్పిడి చేయలేము. ఇటువంటి నోట్లను ఆర్‌బిఐ ఇష్యూ కార్యాలయంలో మాత్రమే జమ చేయవచ్చు. బ్యాంకులో జమ చేయడానికి కుదరదు. అయితే ఇంకొక సదుపాయాన్ని కూడా ఆర్‌బిఐ ఇచ్చింది. మీరు ఒకవేళ ఎటువంటి పన్నుగాని, బిల్లులు గాని చెల్లించాలిసి వస్తే మీ దగ్గర ఉన్న చినిగిన నోట్లతో బ్యాంకుల్లో చెల్లించవచ్చు. ఇంకెందుకు ఆలస్యం మీ దగ్గర చినిగిన నోట్లు ఉంటే వెతికి బయటకు తీసి మార్చేయండి మరి.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version