టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయి రాజమండ్రీ సెంట్రల్ జైలులో ఉన్న విషయం తెలిసిందే. ఇవాళ ములాఖత్ లో భాగంగా భార్య నారా భువనేశ్వరి, కొడుకు లోకేష్, కోడలు బ్రహ్మాణి చంద్రబాబును కలిశారు. ఈ సందర్భంగా వారు ఆయన పలు విషయాల గురించి చర్చించారు. అనంతరం మీడియాతో నారా భువనేశ్వరి మాట్లాడుతూ.. ముఖ్యంగా పొద్దున్నుంచి రాత్రి వరకు ఆంధ్రప్రదేశ్ ప్రజల గురించే మాట్లాడేవారు. ఆయన జీవితం అంతా మీ కోసమే బాధపడుతాడు. ప్రజలు ముందు.. ఆ తరువాతే కుటుంబం. ఆయన నిర్మించిన బిల్డింగ్ లోనే కట్టి పడేశారు. మీ హక్కు కోసం మీరు పోరాడాలి. చంద్రబాబుని చూసి బయటికి వచ్చేసిన కార్యకర్తలకు, తెలుగుదేశం
ఇది మా కుటుంబానికి కష్ట సమయం. ఆయనను చూసి వస్తుంటే నాలో ఒకభాగం అక్కడే వదిలేసి వచ్చినట్టు అనిపించింది. ముఖ్యంగా ఎన్టీఆర్ స్థాపించిన పార్టీ టీడీపీ.. ఇది ప్రజల కోసం నిలుస్తుందని పేర్కొన్నారు. జైలులో నెంబర్ వన్ సౌకర్యాలు సరిగ్గా లేవు. చన్నీళ్లతో స్నానాలు చేయాల్సి వస్తుంది. ఆరోగ్యం మాత్రం బాగానే ఉంది. మీరందరూ బయటికి వచ్చి మీ హక్కు కోసం మీరు పోరాడాలి. జైలులో కూడా చంద్రబాబు నాయుడు ప్రజల కోసమే ఆలోచిస్తున్నారని భువనేశ్వరి తెలిపారు. ఏమి లేని కేసులో చంద్రబాబును జైలులో పట్టారని పేర్కొన్నారు.