ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం చంద్రబాబు నాయుడును గత శనివారం రోజున సిఐడి పోలీసులు స్కిల్ డెవలప్మెంట్ కేసులో నిధులు దారి మళ్లాయన్న విషయంలో అరెస్ట్ చేశారు. ఆ తర్వాత ఏసీబీ కోర్ట్ లో చంద్రబాబు ను ప్రవేశ పెట్టగా, కోర్ట్ అతనికి 14 రోజుల పాటు రిమాండ్ ను విధిస్తూ రాజమండ్రి సెంట్రల్ జైలుకు పంపించింది. ఆ తర్వాత చంద్రబాబుకు జ్యూడిషియల్ రిమాండ్ నుండి మినహాయింపును ఇస్తూ హౌస్ అరెస్ట్ కు ఉత్తర్వులు ఇవ్వాలని ఏసీబీ కోర్ట్ లో పిటిషన్ వేశారు చంద్రబాబు తరపున లాయర్లు. అయితే ఈ పిటిషన్ పై ఏసీబీ కోర్ట్ లో లాయర్ ల మధ్య వాదనలు జరుగగా… తీర్పును మాత్రం ఈ రోజుకి వాయిదా వేయడం జరిగింది. కాసేపటి క్రితమే తీర్పును వెల్లడించింది, చంద్రబాబు లాయర్లు వేసిన పిటిషన్ ను కొట్టివేసింది. ఇప్పుడు ఇక చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైలుకే పరిమితం కానున్నారు.
ఇటువంటి షాక్ తగిలిన నేపథ్యంలో చంద్రబాబు తరపున లాయర్లు మరియు లోకేష్ ఎటువంటి నిర్ణయం స్టెప్ తీసుకోనున్నారు అన్నది తెలియాల్సి ఉంది.