తెలంగాణ ఎన్నికలు మేలో జరగవచ్చు అంటూ….తెలంగాణ ఎన్నికలపైన భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ కామెంట్స్ చేసినట్లుగా కొన్ని మీడియా ఛానళ్లు స్క్రోలింగ్స్ ప్రచారం చేస్తున్నాయని, అలాంటి ప్రస్తావన ఏమాత్రం రాలేదు దయచేసి అవాస్తవాలను ప్రచారం చేయవద్దని విజ్ఞప్తి చేశారు. అయితే.. తెలంగాణలో ఎన్నికల నిర్వహణ ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలపై ఆధారపడి ఉందని, ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల తర్వాతే తెలంగాణలో నవంబర్ లేదా డిసెంబర్ లో ఎన్నికలు జరుగుతాయా లేదా అనే క్లారిటీ వస్తుందని మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించినట్లు పలు ఛానళ్లు ప్రచారం చేశాయి..
అంతేకాకుండా.. తెలంగాణ ఎన్నికలు షెడ్యూల్ ప్రకారం జరగాలంటే అక్టోబర్ 10 లోపు నోటిఫికేషన్ రావాలని మంత్రి కేటీఆర్ అన్నట్లుగా. అక్టోబర్ 10 లోపు నోటిఫికేషన్ వస్తేనే తెలంగాణ ఎన్నికలు జరుగుతాయని.. లేదంటే కష్టమే.. ఏప్రిల్ లేదా మే నెలలో తెలంగాణ ఎన్నికలు జరగొచ్చని కేటీఆర్ చెప్పినట్లు ప్రచారం జరిగింది. అఇతే.. దీనిపై క్లారిటీ ఇచ్చారు. ఇదిలా ఉంటే.. ఇవాళ మంత్రి కేటీఆర్ మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తారని, 65 సంవత్సరాల లో ప్రతిపక్షాలు పెట్టిన మెడికల్ కాలేజీలు, కేవలం రెండు మెడికల్ కాలేజీలే అని ఆయన అన్నారు. కేంద్రం ఒక్క మెడికల్ కాలేజీ ఇవ్వలేదు, నర్సింగ్ కాలేజీ ఇవ్వలేదు, నవోదయ పాఠశాల ఇవ్వలేదన్నారు మంత్రి కేటీఆర్. ఇతర రాష్ట్రాల్లో ఉన్న అస్థిరత, నాయకత్వ లోపం తెలంగాణలో లేదని, మా ముఖ్యమంత్రి అభ్యర్థి కేసీఆర్ గారు, ప్రతిపక్షాల ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరో వారికే తెలియదన్నారు మంత్రి కేటీఆర్. ఢిల్లీ నుంచి వచ్చి సీల్డ్ కవర్లు, వారికి అందించే మూటలు మాత్రమే ప్రతిపక్షాల పరిస్థితి అని, ముఖ్యమంత్రులను మార్చడానికి మత కల్లోలాలను లేపి మరణహోమం సృష్టించి, మనుషులను చంపిన పార్టీ కాంగ్రెస్ అని ఆయన దుయ్యబట్టారు