భార్య భువనేశ్వరికి చంద్రబాబు ఉమెన్స్ డే గిఫ్ట్

-

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు భార్య భువనేశ్వరికి  ఉమెన్స్ డే గిఫ్ట్ రూ.25 వేలతో చీర కొన్నారు.  మార్కాపురం మహిళా దినోత్సవ వేడుకల్లో భాగంగా పలు స్టాల్స్ ను ప్రారంభించారు ముఖ్యమంత్రి. అనంతరం తన భార్య భువనేశ్వరి కోసం స్వయంగా చీరలు సెలక్ట్ చేసి కొనుగోలు చేసారు. ఈ సందర్భంగా చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని సూచించారు.

అలాగే తన భార్య భువనేశ్వరి తాను సీఎం గా కాక ముందు కుటుంబాన్ని చక్కదిద్దడంతో పాటు వ్యాపారంలో కూడా రాణించిందని గుర్తు చేశారు. అందరూ మహిళలు అలాగే రాణిస్తే.. రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. అరటి వ్యర్థాలతో తయారు చేసిన టోపీని చంద్రబాబు ధరించారు. చేనేత రథాన్ని ప్రారంభించడంతో పాటు మహిళా ర్యాపిడో డ్రైవర్లను అభినందించారు. గుర్రపు డెక్క, అరటి, కొబ్బరి వ్యర్థాలతో పీచు తయారీ ద్వారా ఆదాయం లభిస్తుందని సీఎం చంద్రబాబు తెలిపారు. మహిళలు తయారు చేసిన ఉత్పత్తులకు నాణ్యత, బ్రాండింగ్ తీసుకురావాలన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news