తెలంగాణ అభివృద్ధే ధ్యేయంగా రాష్ట్ర వ్యాప్తంగా 10 జాతీయ రహదారులను పూర్తి చేశామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఇవాళ ఆయన హైదరాబాద్ లోని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. రూ.6.280 కోట్ల వ్యయంతో 285 కి.మీ నూతన జాతీయ రహదారులను నిర్మించామని అన్నారు. ఆ రహదారుల ప్రారంభానికి రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వస్తారని పేర్కొన్నారు. అదేవిధంగా రీజినల్ రింగ్ రోడ్డు గురించి కూడా ఆయనతో చర్చించామని తెలిపారు. ఫైనాన్స్ కి సంబంధించి ట్రై పార్టీ అగ్రిమెంట్ జరగాల్సి ఉందని అన్నారు.
ఆర్ఆర్ఆర్ ఉత్తర భాగానికి రూ.18,772 కోట్లు ఖర్చు అవుతోందని ఇప్పటికే అంచనా వ్యయాన్ని అధికారులు సిద్ధం చేశారని పేర్కొన్నారు. ఈ మేరకు కేంద్ర కేబినెట్ నోట్ కూడా ప్రిపేర్ అవుతున్నట్లుగా కిషన్ రెడ్డి తెలిపారు. ఆరాంఘర్ నుంచి శంషాబాద్ కి ఆరు లేన్ల హైవే పూర్తి అయిందని అన్నారు. శంషాబాద్ ఎయిర్పోర్టుకు వెళ్లే వాళ్ల కోసం సిగ్నల్ ఫ్రీ రోడ్డు కూడా పూర్తి అయిందని తెలిపారు. వచ్చే నెలలో బీహెచ్ ఈఎల్ ఫ్లై ఓవర్ కూడా పూర్తి కాబోతోందని అన్నారు. బీహెచ్ ఈఎల్ ఫ్లై ఓవర్ పూర్తి అయితే కూకట్పల్లి పటాన్చెరు మధ్య ట్రాఫిక్ కంట్రోల్ అవుతుందని కిషన్ రెడి అన్నారు.