కాంగ్రెస్ ప్రభుత్వానికి పోయేకాలం దగ్గర పడ్డదని, అందుకే జగద్గిరిగుట్టలో గుళ్లకు నోటీసులు ఇప్పించారని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ జగద్గిరిగుట్టలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయం సమీపంలో కొండపై వెలిసిన పలు గుళ్ల నిర్వాహకులకు, డెయిరీ ఫాం, క్రిస్టియన్ మిషనరీ సంస్థకు కుత్బుల్లాపూర్ తహసీల్దార్ నోటీసులు ఇచ్చారని తెలిపారు. గత కొద్ది రోజుల క్రితం హైడ్రా కమిషనర్ జగద్గిరిగుట్ట కొండపై వెలిసిన గుళ్లను, అక్రమ నిర్మాణాలను పరిశీలించారని, వారి ఆదేశాల మేరకు తహసీల్దార్ 15 గుళ్ల నిర్వాహకులకు, ఒక డెయిరీ ఫాంకు, ఒక క్రిస్టియన్ మిషనరీకి అక్రమ నిర్మాణాలు కాళీ చేయాలని నోటీసులు ఇచ్చారని పేర్కొన్నారు.
దీంతో గుళ్ల బాధితుల జేఏసీ ఏర్పాటు చేసిన సమావేశంకు హాజరైనట్టు తెలిపారు. సీఎం రేవంత్ పాలనతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, హైడ్రా పేరుతో డ్రామా ఆడుతున్నారని ఆరోపించారు. జగద్గిరిగుట్ట కొండపై ఎన్నో ఏళ్లుగా కొందరు కుల సంఘాల ఆధ్వర్యంలో వారి ఇష్ట దైవాలకు గుళ్లు
కట్టుకుని పూజిస్తున్నారని.. అలాంటి వారి విశ్వాసాలను రేవంత్ ప్రభుత్వం కూలగొడతా అంటూ
నోటీసులు ఇవ్వడం ధర్మం కాదన్నారు.