భువనేశ్వరి క్యాంపు సైట్ లో చంద్రబాబు జన్మదిన వేడుకలు…

-

భువనేశ్వరి క్యాంపు సైట్ లో చంద్రబాబు జన్మదిన వేడుకలు జరిగాయి. టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు 75వ జన్మదిన వేడుకలు కుప్పం పి. ఈ. ఎస్ మెడికల్ కాలేజీ లోని నారా భువనేశ్వరి బస కేంద్రంలో ఘనంగా జరిగాయి.

Chandrababu’s birthday celebrations at Bhubaneswari camp site

తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనిమిని రవి నాయుడు, భువనేశ్వరి టీమ్ ఆధ్వర్యంలో చంద్రబాబు జన్మదిన వేడుకలు జరిగాయి. రవి నాయుడు ఏర్పాటు చేసిన కేక్ ను చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి కట్ చేసి టీమ్ సభ్యులకు పంచారు. చంద్రబాబు జన్మదిన వేడుకల్లో ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, డాక్టర్ సురేష్, నారా భువనేశ్వరి టీమ్, కుప్పం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news