ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గళం.. నాగర్‌కర్నూల్‌కు బలం : KTR

-

ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గళం.. నాగర్‌కర్నూల్‌కు బలం అంటూ KTR ట్వీట్‌ చేశారు. మన బీఆర్ఎస్ పార్టీ నాగర్‌కర్నూల్ ఎంపీ అభ్యర్థి రిటైర్డ్ ఐపీఎస్ అధికారి డా. ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్… సంచలనాలకు, సంస్కరణలకు, సరికొత్త ఆలోచనలకు పెట్టింది పేరు డా. ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. నల్లమల ప్రాంతంలో పుట్టిన ప్రవీణ్ కుమార్ గారు తన 6 ఏళ్ల పదవి కాలాన్ని వదులుకొని బడుగు బలహీనవర్గాల అభ్యున్నతి కోసం బహుజనవాదాన్ని భుజాన ఎత్తుకొని ప్రజాసేవలోకి అడుగుపెట్టారన్నారు.

KTR sensational announcement on Khammam MP position

తన పదవీ కాలంలో పోలీస్ వ్యవస్థలో ఎన్నో వినూత్న మార్పులకు శ్రీకారం చుట్టిన ప్రవీణ్ కుమార్, ఫ్రెండ్లీ పోలీసింగ్‌కి ఆద్యులు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలతో పాటు ఐక్యరాజ్యసమితి కోసం ఒకప్పటి యుగోస్లావియాలో కూడా పని చేశారని కొనియాడారు. తన సేవలకు గాను రాష్ట్రపతి పురస్కారం, యునైటెడ్ నేషన్స్ పోలీస్ మెడల్, పోలీస్ గ్యాలంట్రి మెడల్ వంటి ఎన్నో అత్యున్నత పురస్కారాలను అందుకున్నారన్నారు.

తెలంగాణ ఏర్పడ్డాక కేసీఆర్ గారి నాయకత్వంలో జరిగిన గురుకుల విద్యా విప్లవంలో ప్రవీణ్ కుమార్ నిర్వహించిన పాత్ర అమోఘమైనదని తెలిపారు. సాంఘిక సంక్షేమ గురుకులాల ద్వారా ఎందరో బలహీనవర్గాలకు చెందిన విద్యార్థులు ఉన్నత చదువులు అందుకోవడానికి.. ప్రతిష్టాత్మక విద్యాలయాల్లో సీట్లు సంపాదించడానికి.. జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో క్రీడలో రాణించడానికి తన తోడ్పాటును అందించారన్నారు. ప్రవీణ్ కుమార్ గారు ఇప్పుడు నాగర్‌కర్నూల్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా మన ముందుకు వస్తున్నారు. సమర్ధత గల నాయకులు పార్లమెంట్‌లో ఉంటే ఆ పదవికి వన్నె తేవడం ఖాయం.. మన సమస్యల పరిష్కారం తథ్యం అంటూ కేటీఆర్‌ వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news