Chandrababu’s decision to release a white paper on Polavaram: పోలవరంపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారట. చంద్రబాబు సర్కార్ నేడు(శుక్రవారం) పోలవరంపై శ్వేత పత్రం విడుదల చేయనుంది. గత వైసీపీ ప్రభుత్వంలో పోలవరం ప్రాజెక్టును ఏ రకంగా నిర్వీర్యం చేశారనే దానిపై వైట్ పేపర్ లో వివరించనున్నారు.

వాస్తవాలను ప్రజల ముందు ఉంచాలనే ఉద్దేశంతో ఈరోజు నుంచి శ్వేత పత్రాలు రిలీజ్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మధ్యాహ్నం మూడు గంటలకు పోలవరం ప్రాజెక్టు స్థితిగతులపై మంత్రి నిమ్మల రామానాయుడు వైట్ పేపర్ రిలీజ్ చేయనున్నారు.
మొత్తం 7 ప్రభుత్వ శాఖల్లో స్థితిగతులపై శ్వేతపత్రాల విడుదలకు కూటమి ప్రభుత్వ నిర్ణయం తీసుకుందట. మొదటగా గత ప్రభుత్వ హాయంలో జరిగిన పోలవరం విధ్వంసంపై సెక్రటేరీయేట్టులో శ్వేతపత్రం విడుదల చేయనున్నారు సీఎం చంద్రబాబు. ప్రాజెక్టు విషయంలో వాస్తవాలు ప్రజలకు తెలియజెప్పాలని సీఎం చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నారట.