తెలంగాణ పీసీసీ చీఫ్ గా మధుయాష్కి గౌడ్ ?

-

Madhuyashki Goud as Telangana PCC chief:  తెలంగాణ కాంగ్రెస్ కు కొత్త బాస్ రాబోతున్నారట. ఢిల్లీలోనే అందుబాటులో ఉండాల‌ని ఏఐసీసీ ఆర్డ‌ర్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. ఇవాళ రాత్రి 8గంట‌ల‌కు ముఖ్య‌నాయ‌కుల‌తో సీఎం రేవంత్, ఇంచార్జ్ భేటీ కానున్నారు. ఖ‌మ్మం ప‌ర్య‌ట‌న అర్ధాంత‌రంగా ముగించుకొని ఢిల్లీ వెళ్ల‌నున్నారు భ‌ట్టి. పీసీసీ రేసులో మ‌ధుయాష్కీ ఉన్నట్లు సమాచారం.

Madhuyashki Goud as Telangana PCC chief

పీసీసీ చీఫ్ రేసులో మహేశ్ కుమార్ గౌడ్, మధుయాష్కి గౌడ్ సహా పలువురు నేతలు ఉన్నప్పటికీ… అధిష్టానం మాత్రం మధుయాష్కి గౌడ్ పదవి ఇవ్వనున్నట్లు సమాచారం అందుతోంది. దీంతో ఢిల్లీలో ఉన్నారు సీఎం రేవంత్‌. అంతేకాదు…టీపీసీసీ అధ్యక్ష పదవి కోసం ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన సీతక్క, బలరాం నాయక్, ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన సంపత్ కుమార్ పేర్లను అధిష్టానం ముందు ఉంచారట రేవంత్ రెడ్డి. మంత్రి పదవి రాకపోతే టీపీసీసీ అధ్యక్ష పదవి అయినా తీసుకుందామని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, జగ్గారెడ్డి అనుకుంటుండగా వీళ్లకు చెక్ పెట్టేందుకు చూస్తున్నారట రేవంత్ రెడ్డి.

 

Read more RELATED
Recommended to you

Latest news