నేడు చంద్రబాబుకు కంటికి శస్త్రచికిత్స !

-

తెలుదేశం పార్టీ చీఫ్ చంద్రబాబు నాయుడు నేడు కంటికి శస్త్ర చికిత్స చేయించుకోనున్నట్లు సమాచారం. ఎల్వీ ప్రసాద్ ఆసుపత్రిలో ఈ ఆపరేషన్ చేయించుకుంటారని తెలుస్తోంది. ఇప్పటికే రెండుసార్లు హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏఐజి ఆసుపత్రికి వెళ్లిన ఆయన వివిధ వివిధ వైద్య పరీక్షలు చేయించుకున్నారు.

Chandrababu’s eye surgery today

కాగా, స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసులో అరెస్టు అయిన చంద్రబాబు ఇటీవల మధ్యంతర బెయిల్ పై విడుదలైన సంగతి తెలిసిందే. కాగా నిన్న అచ్చెన్నాయుడు మాట్లాడుతూ….వైసీపీ పాలనలో దళితులపై దాడులకు అంతులేదా? అని ఆగ్రహించారు. దళితులంతా బాబుతోనే ఉన్నారని..ఎస్సీలంతా తిరగబడి ఈ ప్రభుత్వాన్ని గద్దె దించాలని కోరారు. ఎస్సీలపై రోజుకో అరాచకం జరుగుతున్నా మంత్రులు నోరు విప్పడం లేదని ప్రశ్నించారు. వైసీపీ సామాజిక బస్సు యాత్ర ద్వారా ఏం సందేశం ఇస్తున్నారు….29 ఎస్సీ స్థానాల్లో 29 చోట్ల టీడీపీ గెలవాలని కోరారు. దళితుల ఆత్మగౌరవాన్ని వైసీపీ దళిత ప్రజా ప్రతినిధులు జగన్ కాళ్ల దగ్గర తాకట్టు పెడుతున్నారని ఫైర్ అయ్యారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version