Chandrababu’s decision on free travel for women in RTC buses: ఏపీ మహిళలకు అదిరిపోయే శుభవార్త అందింది. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణంపై సీఎం చంద్రబాబు నాయుడు ప్రత్యేక దృష్టిపెట్టారు. ఇందులో భాగంగానే… నేడు ఆర్టీసీ, రవాణాశాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు.

ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, బస్సుల సౌలభ్యంపై చర్చ నిర్వహించనున్నారు సీఎం చంద్రబాబు నాయుడు. అటు కర్ణాటక, తెలంగాణలో ఫ్రీ బస్సు అమలుపై అధ్యయనం చేసే యోచనలో సీఎం చంద్రబాబు నాయుడు ఉన్నారు. ఇవాళ దీనిపై చర్చించి….ఆగస్ట్ 15 వ తేదీ వరకు ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం అమలు చేసే ఛాన్స్ ఉంది. ఉచిత బస్సు ప్రయణానికి నెలకు 250 కోట్లు అంచనా వేస్తున్నారు చంద్రబాబు. మహిళలకు ఉచిత బస్సు అమలుకు ప్రభుత్వం నెలకు 25% వరకూ కార్పొరేషన్ కు వదిలేయాలని…. మరో 125 కోట్ల వరకూ నెలకు ఆర్టీసీ కే ప్రభుత్వం రీఇంబర్సుమెంటు ఇవ్వాల్సి ఉంటుందని అంచనా వేస్తున్నారు బాబు.