3200 టిడ్కో ఇళ్ళ పంపిణీపై చంద్రబాబు సంచలన ప్రకటన

-

3200 టిడ్కో ఇళ్ళ పంపిణీపై చంద్రబాబు సర్కార్‌ సంచలన ప్రకటన చేసింది. ఈ మేరకు తాడికొండ ఎంఎల్ఏ తెనాలి శ్రవణ్ కుమార్ మాట్లాడుతూ…టిడ్కో ఇళ్ళలో నివసించే ప్రజలు అనేక సమస్యలు మా దృష్టికి తెచ్చారన్నారు. తాడికొండ నియోజకవర్గం లో 3200 ఇళ్ళు నిర్మాణం జరిగాయి…ఇటీవల కురిసిన వర్షాల కారణంగా అనేక సమస్యలు తలెత్తాయన్నారు. వాటిని త్వరలోనే పంపిణీ చేసే దిశగా అడుగులు వేస్తామన్నారు.

tidko

అప్రోచ్ రోడ్లు, మంచినీరు, డ్రైనేజీలు సమస్యలు ఎక్కువగా ఉన్నాయని…. కంప చెట్లు మొలిచి ఇబ్బందులు, లైట్లు లేవని కూడా మా దృష్టికి వచ్చిందని తెలిపారు.
మంత్రి నారాయణ పర్యటన తో సమస్యలు తీర్చడానికి శ్రీకారం చుట్టారు…CRDA పరిధిలో జరిగిన నిర్మాణాలు ఇవి‌ అని తెలిపారు. టిడ్కో స్కీం మొత్తాన్ని జగన్ అర్ధం పర్ధం లేకుండా తయారుచేసారని…. రంగు లేసుకోవడం మీద ఉన్న శ్రద్ద సౌకర్యాల కల్పన మీద చూపలేదని ఆగ్రహించారు. తుళ్ళూరు మండలంలో 1184 ఇళ్ళు ఇక్కడ కట్టారు.. దీనిని సుందర ప్రదేశంగా తీర్చిదిద్దాలని సీఎం ఆదేశించారని తెలిపారు. గ్రామాలలో ఔట్ సోర్సింగ్ లో కార్మికులుగా చేసే వారికి నిరుపేదల పెన్షన్ ఆగిపోయింది… వారికి పెన్షన్ ఇప్పించాలని డిమాండ్‌ చేశారు తాడికొండ ఎంఎల్ఏ తెనాలి శ్రవణ్ కుమార్.

Read more RELATED
Recommended to you

Latest news