3 నెలల్లో టిడ్కో ఇళ్ల పంపిణీ చేస్తామని హామీ ఇచ్చారు మంత్రి నారాయణ. మునిసిపల్ శాఖామంత్రి నారాయణ ఇవాళ మీడియాతో మాట్లాడుతూ…7,01,481 టిడ్కో ఇళ్ళకు అనుమతి తెచ్చి 454740 గృహాలకు కాంట్రాక్టులు సిద్ధం అయ్యాయి…. నాటికి 3.13 లక్షల ఇళ్ళు గ్రౌండ్ ఫ్లోర్ పూర్తి అయ్యాయని చెప్పారు.
వైసీపీ వచ్చిన తరువాత 2,52,216 కి ఈ ఇళ్ళను తగ్గించేసింది…నాలుగు గోడలు ఒక శ్లాబ్ వేస్తే చాలు అంటూ టిడ్కో ఇళ్ళు తగ్గించేసారన్నారు. హై క్వాలిటీ రోడ్లు, డ్రెయిన్ లు, కమ్యూనిటీ హాలు, స్కూళ్ళు తో డిజైన్ చేసామని… 2019 లో వచ్చిన వైసీపీ ప్రభుత్వం నాశనం చేసేసిందని వివరించారు. ఖజానా ఖాళీగా ఉంది.. 3 నెలల్లో మిగిలిన నిర్మాణాలు పూర్తి చేయడానికి ప్రయత్నిస్తామని తెలిపారు. 5253 కోట్లు ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బ్యాంకు నుంచీ తెస్తే స్టేట్ గవర్నమెంట్ షేర్ ఇవ్వకుండా ఫండ్స్ తేలేదు..ఆర్ధిక వ్యవహారాలలో బాధ్యత లేని విధంగా పని చేసింది వైసీపీ ప్రభుత్వమని వివరించారు. ఇపుడు సీఆర్డీఏలో పైసా లేదు.. బడ్జెట్ లో పెట్టి ఇద్దాం అని సీఎం అన్నారన్నారని గుర్తు చేశారు.