ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇవాళ అనంతపురం జిల్లా లో పర్యటించనున్నారు. ఇవాళ ఉదయం 9.30 గంటలకు ఉండవల్లి నుంచి ఆయన బయలుదేరి గన్నవరం ఎయిర్ పోర్ట్ కి చేరుకుంటారు. ఇక అక్కడి నుంచి పుట్టపర్తి చేరుకొని హెలిక్యాప్టర్ లో వజ్రకరూర్ మండలం ఛాయాపురం గ్రామానికి చేరుకుంటారు. మార్గ మధ్యలో హంద్రీనీవా కాలువ పనులను కూడా పరిశీలించనున్నారు సీఎం చంద్రబాబు.
ఇక మధ్యాహ్నం 12.15 గంటలకు ఛాయాపురంలో ప్రజా వేదిక వద్ద అధికారులు, ఇంజినీర్లతో సమావేశ మై అక్కడి నుంచి నేరుగా బెంగళూరు కు పయనమవ్వనున్నారు సీఎం చంద్రబాబు. ఏపీకి ఇటీవలే ప్రధాని నరేంద్ర మోడీ విచ్చేసిన విషయం తెలిసిందే. నిన్న జరిగిన కేబినెట్ సమావేశంలో ప్రధాని పర్యటన పై కూడా చర్చించారు.