భారత్ – పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తల సమయంలో మాజీ క్రికెటర్ ట్వీట్ ఇప్పుడు కలకలం రేపింది. మే 08న పాకిస్తాన్ భారతదేశం పై డ్రోన్లు, క్షిపణులతో దాడి చేయగా.. భారత సైన్యం ప్రతీకార చర్యలు ప్రారంభించింది. ఇదే సమయంలో మాజీ భారత క్రికెటర్ అంబటి రాయుడు చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలకు గురైంది. ముఖ్యంగా రాయుడు ట్విట్టర్ వేదికగా “కంటికి కన్ను.. ప్రపంచాన్ని అంధం చేస్తుంది” అని షేర్ చేశారు.
ఇది భారత అభిమానులకు సమంజసంగా అనిపించలేదు. దాడి తొలుత పాకిస్తాన్ నుంచే వచ్చిందని వారు అభిప్రాయపడుతున్నారు. భారత సైన్యం కేవలం సమర్థ రక్షణ చర్యలే తీసుకుంటోంది అనే అభిప్రాయంతో నెటిజన్లు రాయుడు పై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ట్వీట్ తరువాత పలువురు యూజర్లు రాయుడు ని తీవ్రంగా తప్పు పట్టారు. రక్షణ చర్యలు తీసుకోవడం తప్పా..? అంటూ పలు ప్రశ్నలను నెటిజన్స్ ప్రశ్నించారు. ఈ ట్వీట్ దేశ భక్తికి వ్యతిరేకంగా ఉందని.. రాయుడు సరిగ్గా సమయాన్ని అర్థం చేసుకోలేదని కూడా పలువురు అభిప్రాయపడ్డారు. కొన్ని గంటల తరువాత శాంతి, భద్రత కోసం ప్రార్థిస్తున్నాను అంటూ మరో ట్వీట్ వేయడం విశేషం.
Prayers for peace and safety in Jammu & Kashmir, Punjab and other parts of India along the border. Hoping for strength, security and swift resolution for everyone affected. Jai Hind!
— ATR (@RayuduAmbati) May 8, 2025