BREAKING: ఇవాళ్టి కర్నూలు జిల్లా చంద్రబాబు పర్యటన రద్దు

-

నేటి సీఎం చంద్రబాబు కర్నూలు జిల్లా పర్యటన రద్దు అయింది. ఓర్వకల్ లో చంద్రబాబు ఎన్ఠీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనాల్సింది. అయితే… వాతావరణం కారణంగా నేటి సీఎం చంద్రబాబు కర్నూలు జిల్లా పర్యటన రద్దు అయింది. ముందు పత్తికొండ మండలం పుచ్చకాయలమాడ పర్యటన ఖరారు చేసి ఆ తరువాత రద్దు చేసుకున్నారు సీఎం చంద్రబాబు.

Chandrababu’s visit to Kurnool district today has been cancelled

ఓర్వకల్ లో పర్యటన ఖరారు చేసిన అధికారులు…. వర్షం కారణంగా ఓర్వకల్ పర్యటన కూడా రద్దు చేశారు. ఇక అటు భారీ వర్షాలున్న ప్రాంతాల్లో పెన్షన్ పంపిణీలో సచివాలయ ఉద్యోగులకు వెసులుబాటు కల్పించిన సీఎం చంద్రబాబు…భారీ వర్షాలున్న ఆయా ప్రాంతాల్లో ఇబ్బందులుంటే వచ్చే ఒకట్రెండు రోజుల్లో పెన్షన్ పంపిణీ పూర్తి చేయవచ్చన్నారు. పెన్షన్ పంపిణీ విషయంలో సచివాలయ ఉద్యోగులపై ఒత్తిడి తీసుకు రావద్దన్నారు చంద్రబాబు. టార్గెట్లు పెట్టవద్దని కలెక్టర్లకు సీఎం ఆదేశాలు ఇచ్చారు. వర్షాలు లేని ప్రాంతాల్లో యధావిధిగా పెన్షన్లు పంపిణీ పూర్తి చేయాలని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news