చంద్రబాబు తమ్ముడు నారా రామ్మూర్తి కాంగ్రెస్ లో చేరారు – పేర్ని నాని

-

షర్మిల కాంగ్రెస్ లో చేరిక పై పేర్ని నాని రియాక్ట్‌ అయ్యారు. రాజకీయ నాయకులు పార్టీలు మారడానికి అలవాటు పడ్డారని…షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరడం ఆమె ఇష్టం అంటూ చురకలు అంటించారు పేర్ని నాని. చంద్రబాబు రా కదలి రా అని సభ పెట్టారు.ఎవరు కదలి రావాలి? ఎందుకు రావాలి.? అని ప్రశ్నించారు. పగ వాడికి కూడా చంద్రబాబుకి పట్టిన దుర్గతి పట్టదని…కనిగిరి లో హైదరాబాద్, బెంగుళూరు లో కలిగే అవకాశాలు కల్పిస్తామని అంటున్నారని ఎద్దేవా చేశారు.

చంద్రబాబు కి హరికృష్ణ, ఎన్టీఆర్ వ్యతిరేకం కాదా? పురంధ్రీశ్వరి వ్యతిరేకం కాదా? అంటూ ప్రశ్నించారు. చంద్రబాబు సొంత తమ్ముడు నారా రామ్మూర్తి నాయుడు కాంగ్రెస్ లో చేరి పని చేశారా లేదా? అని నిలదీశారు. తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వర రావు చంద్రబాబు మీద పుస్తకం రాయలేదా? అని మండిపడ్డారు. 2014-2019 మధ్య ఎందుకు అవకాశం ఎందుకు కల్పించ లేదు.?? పవన్, చంద్రబాబుకి పిచ్చి మాటలు చెప్పే అలవాటు వుందన్నారు. చంద్రబాబు 14 ఏళ్ల పాలనలో నిత్యావసరాల ధరలు తగ్గించారా? అని ప్రశ్నించారు పేర్ని నాని.

Read more RELATED
Recommended to you

Exit mobile version