నేడే చంద్రయాన్‌-3 ప్రయోగం

-

చందమామపై పరిశోధనలకు శ్రీకారం చుట్టిన ఇస్రో.. చంద్రయాన్ 3 ద్వారా చందమామ గురించి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తోంది. జాబిల్లిపై అన్వేషణ కోసం భారత ఇస్రో ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న చంద్రయాన్‌-3 ప్రయోగానికి రంగం సిద్ధమైంది. తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీశ్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ (షార్‌)లో ఈ ప్రయోగానికి గురువారం మధ్యాహ్నం 1.05 గంటలకు కౌంట్‌డౌన్‌ ప్రారంభమైంది. ఈ కౌంట్‌డౌన్‌ దాదాపు 25 గంటల పాటు సాగనుంది. ఇవాళ మధ్యాహ్నం 2:35:13 గంటలకు రెండో ప్రయోగ వేదిక నుంచి ఎల్‌వీఎం3-ఎం4 రాకెట్‌ నింగిలోకి దూసుకెళ్లనుంది.

చంద్రయాన్‌ సిరీస్‌లో ఇది మూడో ప్రయోగం. ఎల్‌వీఎం3-ఎం4 భారీ వాహకనౌక ద్వారా ఈ ప్రయోగం చేపట్టనున్నారు. ఈ ఉపగ్రహాన్ని ల్యాండర్‌, రోవర్‌ ప్రొపల్షన్‌ మాడ్యూల్‌తో అనుసంధానించారు. సుమారు 3,84,000 కి.మీ. ప్రయాణించి చంద్రుని నుంచి వంద కిలోమీటర్ల ఎత్తులోని కక్ష్యలోకి ఇది చేరుకుంటుంది. ఆ తర్వాత జాబిల్లి దక్షిణ ధ్రువంలోని నిర్దేశిత ప్రదేశంలో ల్యాండ్‌ అవుతుందని ఇస్రో వెల్లడించింది. చంద్రయాన్‌-3 చంద్రుడి దగ్గరకు చేరడానికి 40 రోజుల సమయం పడుతుందని తెలిపింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version