చంద్రయాన్‍- 3 ప్రయోగానికి నేడు కౌంట్ డౌన్‌ ప్రారంభం

-

చంద్రయాన్‌-3 ప్రయోగానికి రంగం సిద్ధమైంది. తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీశ్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ ప్రయోగానికి సన్నాహాలు చేసింది. ఇవాళ మధ్యాహ్నం 2 గంటల 35 నిమిషాలకు కౌంట్‌ డౌన్‌ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ కౌంట్ డౌన్ ప్రక్రియ 24 గంటలు కొనసాగనుంది. శుక్రవారం మధ్యాహ్నం ఇదే సమయానికి రెండో ప్రయోగ వేదిక నుంచి L.V.M-3P4 రాకెట్‌ నింగిలోకి దూసుకెళ్లనుంది. షార్‌కు చేరుకున్న ఇస్రో అధిపతి సోమనాథ్‌ వాహక నౌకను పరిశీంచి.. శాస్త్రవేత్తలతో సమీక్షించారు. ప్రయోగ లాంఛ్‌ విండో జులై 19వ తేదీ వరకు ఉందని తెలిపారు.

‘‘ఈసారి చంద్రుడి ఉపరితలంపై సాఫ్ట్‌ లాండింగ్‌లో విజయవంతం అవుతామని విశ్వాసంగా ఉన్నాం. జులై 13-19 వరకు లాంఛ్‌ విండో అందుబాటులో ఉంది. తొలి రోజే ప్రయోగం చేపట్టాలని భావిస్తున్నాం’’ అని సోమనాథ్‌ వెల్లడించారు. చంద్రయాన్‌ సిరీస్‌లో ఇది మూడో ప్రయోగం. జీఎస్‌ఎల్‌వీ ఎం-3 భారీ వాహకనౌక ద్వారా ఈ ప్రయోగం చేపట్టనున్నారు. చంద్రుడి ఉపరితలంపై సాఫ్ట్‌ ల్యాండింగ్‌ అయ్యేలా దీన్ని చేపట్టనున్నారు. ల్యాండర్‌-రోవర్‌ కాంబినేషన్తో దీన్ని ప్రయోగించనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news