మహానంది ఆలయ పరిసరాల్లో చిరుత హల్ చల్

-

Cheetah Hal Chal in the vicinity of Mahanandi Temple: నంద్యాల జిల్లా మహానంది క్షేత్రం పరిసరాల్లో చిరుత హల్ చల్ చేసింది. ఈ మధ్య కాలంలో తిరుమల శ్రీవారి సన్నిధిలో చిరుతలు ఎక్కువగా కనిపించగా… ఇప్పుడు మహానంది క్షేత్రం పరిసరాల్లో చిరుత హల్ చల్ చేసింది. ఆలయ ఈ. ఓ. ఆఫీస్ పక్కన ఉన్న విద్యుత్ ఆఫీస్ వద్ద చిరుత సంచారం చేసింది.

Cheetah Hal Chal in the vicinity of Mahanandi Temple

అడవిలో నుండి గ్రామాల్లోకి ప్రవేశించిన చిరుత…మహానంది క్షేత్రం పరిసరాల్లో హల్ చల్ చేసింది. కుక్కలు భీకారంగా అరుస్తూ ఉండటంతో అలర్ట్ అయ్యారు విద్యుత్ సిబ్బంది. అటు స్థానికులు , విద్యుత్ సిబ్బంది కేకలు ,విజిల్స్ వేయడంతో అడవిలోకి పారిపోయింది చిరుత. భక్తులు ఎవరు లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. అటవీశాఖ అధికారులకు సమాచారం అందించిన ఆలయ అధికారులు…జరిగిన విషయాన్ని తెలిపారు. ఇక ఇవాళ చిరుత పాద ముద్రలను పరిశీలించనున్నారు అటవీ అధికారులు.

Read more RELATED
Recommended to you

Latest news