గొర్రెల పంపిణీ స్కామ్.. రూ. 700 కోట్ల నిధుల మళ్లింపుపై ఈడీ ఆరా

-

రాష్ట్రంలో సంచలనం సృష్టించిన గొర్రెల పంపిణీ స్కీమ్ స్కామ్​లో  ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) రంగప్రవేశం సూత్రదారుల్లో గుబులు రేపుతోంది. సుమారు 700 కోట్ల రూపాయలు దారి మళ్లినట్లు అవినీతి నిరోధక శాఖ గుర్తించిన నేపథ్యంలో ఈడీ రంగలోకి దిగి..  ఆ సొమ్ము అంతిమ లబ్ధిదారులను గుర్తించేందుకు వేట మొదలు పెట్టింది. ఈ క్రమంలో బినామీ ఖాతాల్లోని లావాదేవీలే కీలకం కానున్నాయి. ఈడీ అధికారులు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ కేస్‌ ఇన్ఫర్‌మేషన్‌ రిపోర్టు నమోదు చేసి వివరాలు సేకరిస్తుండటంతో ఈ లావాదేవీలే నిందితుల మెడకు ఉచ్చు బిగించనున్నాయనే  అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఈ కుంభకోణంలో ఇప్పటి వరకు 10 మంది నిందితుల్ని గుర్తించి 8మందిని అరెస్టు చేసింది. దారి మళ్లిన సొమ్ములో వీరు వాటా దారులు మాత్రమేనని తేలినట్లు అధికారులు తెలిపారు. మిగిలిన సొమ్ము ఎవరి జేబులోకి వెళ్లిందని తేల్చడం పైనే దృష్టి సారించినట్లు ఈడీ వెల్లడించింది. ఈ క్రమంలో ఇప్పటికే గొర్రెల కొనుగోలుకు మంజూరు చేసిన సొమ్ము ఎవరి ఖాతాల్లోకి వెళ్లిందనే  సమాచారం సేకరించే పనిలో నిమగ్నమైంది.

Read more RELATED
Recommended to you

Latest news