వైసిపి మాజీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డికి ఊహించని షాక్ తగిలింది. విజయ సాయి రెడ్డికి cid పోలీసులు నోటీసులు జారీ చేశారు. మంగళగిరిలో కేసు బుక్ అయిన నేపథ్యంలో.. ఏపీ సిఐడి పోలీసులు.. విజయ సాయి రెడ్డి కి నోటీసులు ఇవ్వడం జరిగింది. ఈనెల 12వ తేదీ అంటే రేపు విచారణకు హాజరు కావాలని కూడా… ఈ నోటీసుల్లో పేర్కొన్నారు. నోటీసులలో… 506, 384, 420, 109, 467, 120(b), రెడ్‌విత్ 34 BNS సెక్షన్ల ప్రస్తావన కూడా చేశారు ఏపీ పోలీసులు.

కాకినాడ పోర్టు వాటాలను అక్రమంగా బదిలీ చేసుకున్నారని… రాజ్యసభ మాజీ సభ్యులు విజయ్ సాయి రెడ్డి పై కేసు నమోదు కావడం జరిగింది. అక్రమంగా పోర్టువాటాలు బదిలీ చేసుకున్నాడని… విజయ్ సాయి రెడ్డి పై కె.వి రావు అనే వ్యక్తి… కేసు పెట్టారు. అయితే ఈ కేసును తిరిగేసిన ఏపీ సిఐడి పోలీసులు… తాజాగా నోటీసులు ఇచ్చారు. అయితే ఈ నోటీసులపై ఇప్పటివరకు విజయ సాయి రెడ్డి స్పందించలేదు.