పుష్ప 2 చిత్ర లాభాలపై హై కోర్టులో పిల్ దాఖలు చేసారు. అయితే ఈ పుష్ప 2 చిత్రానికి బెనిఫిట్ షోలు, టికెట్ ధరల పెంపు వల్ల భారీగా ఆదాయం వచ్చింది అని పేర్కొన్నారు పిటిషనర్. హోం శాఖ ప్రత్యేక ఉత్తర్వులిచ్చి మరి బెనిఫిట్ షోలు, టికెట్ ధరల పెంచుకోవడానికి అనుమతి ఇచ్చింది అన్నారు పిటిషనర్.
అందువల్ల పుష్ప 2 చిత్రానికి వచ్చిన లాభాలను చిన్న చిత్రాల బడ్జెట్ రాయితీకి వినియోగించాలి అని పేర్కొన్నారు పిటిషనర్. సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం చిత్రాల లాభాలను కళాకారుల సంక్షేమానికి కేటాయించాలి అని న్యాయవాది తెలిపారు. అయితే ఇప్పటికే ఈ సినిమా యొక్క బెనిఫిట్ షోలు, టికెట్ల వసూలు ముగిసింది కదా అని హై కోర్టు ప్రశ్నించాగా.. సినిమా ద్వారా వచ్చిన లాభం గురించే పిటీషన్ దాఖలు చేశాం అని న్యాయవాది పేర్కొన్నారు. దాంతో సుప్రీం కోర్టు తీర్పు కాపీని సమర్పించాలంటు విచారణ 2 వారాలకు వాయిదా వేసింది హై కోర్టు.