ఏలూరు జిల్లాలో తన్నుకున్న జనసేన, టీడీపీ నేతలు !

-

ఏలూరు జిల్లాలో ఉద్రికత్త వాతావరణం చోటు చేసుకుంది. తాజాగా ఏలూరు జిల్లాలో జనసేన, టీడీపీ నేతలు తన్నుకున్నారు. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. ఏలూరు రూరల్ మండలం పైడి చింత పాడు గ్రామంలో జనసేన, టిడిపి నేతల మధ్య ఘర్షణ నెలకొంది. పెన్షన్ పంపిణీ విషయంలో తలెత్తిన వివాదం తలెత్తింది. దీంతో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు జనసేన, టీడీపీ నేతలు.

Clash between Janasena and TDP leaders in Paidi Chintapadu village of Eluru rural mandal

ఈ సంఘటనలో జనసేన, టీడీపీ నేతలకు గాయాలు అయ్యాయి. దీంతో గాయపడిన జనసేన, టీడీపీ నేతలను ఏలూరు ఆసుపత్రిలో చేర్పించారు. ఇటీవల వైసిపి నుండి జనసేన పార్టీలో చేరిన ముంగర వేంకటేశ్వర రావు దాడి చేశారని ఆరోపిస్తున్నారు టిడిపి నేతలు. వైసిపి నుంచి కొంత మంది వ్యక్తులు జనసేన పార్టీ లో చేరి ప్రశాంతంగా ఉన్న లంక గ్రామాలలో చిచ్చు పెడుతున్నారని టీడీపీ వర్గీయులు ఆరోపణ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version