హైదరాబాదులో డబ్బులు ఖర్చు పెట్టలేదు.. సంపద సృష్టించాను : చంద్రబాబు

-

గడిచిన ప్రభుత్వం అమరావతి రైతాంగాన్ని బాధపెట్టారు. రైతు మహిళలు వీరోచితంగా పోరాడారు ఇక్కడ అని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. 16% లోటు బడ్జెట్ తో ఆ రోజు పాలన ప్రారంభించాం. సైబరాబాద్ ఆనాడు ప్రభుత్వ భూములలో నిర్మించినది. 8 వరసల‌‌ రోడ్డును సైబరాబాద్ వద్ద మంచి రోడ్డు రూపకల్పన చేసాం అప్పట్లో. ఏం చేసినా విధ్వంసం చేయడం అలవాటైపోయి ఇష్టానుసారంగా మాట్లాడే పరిస్ధితులు. సెంటిమెంట్ లు ఎన్నున్న రాష్ట్ర భవిష్యత్తు కోసం భూము ఇచ్చారు. 54 వేల‌ ఎకరాలు అమరావతి కోసం సేకరించాం. ఎంతమంది రాక్షస మూకలు వచ్చిన ఈ అమరావతిని బ్రతికించిన ఘనత ఇక్కడి రైతాంగానిది. కొంత రాజీ పడి పనులు పునః ప్రారంభించాం.

అమరావతికి ఒకవైపు 12, మరోవైపు 12 పార్లమెంటు నియోకవర్గాలు ఉంటాయి. విశాఖను ఆర్ధిక రాజధానిని చేస్తాం… కర్నూలులో హైకోర్టు బెంచ్ పెట్టి అభివృద్ధి చేస్తాం. జరీబు భూములకు 50 వేలుతో మొదలెట్టి 10% పెంచుతాం అని చెప్పాం. త్వరలోనే 225 కోట్లు జరీబు భూములకు నిధులు విడుదల చేస్తాం. నేను హైదరాబాదులో డబ్బులు ఖర్చు పెట్టలేదు.. సంపద సృష్టించాను. 30 వేల కోట్లు రాష్ట్రానికి ఆదాయం వస్తుందని చెప్పాను. సెల్ఫ్ ఫైనాన్సింగ్ మోడల్, ఉపాధికి ఒక కేంద్రం. ఏకంగా ఒకాయన ఎడారి అంటాడు.. స్మశానం అంటాడు. హైదరాబాదులో ఆయన కట్టుకున్న కొంప దగ్గరే నీళ్ళు వచ్చాయి. ఎవరూ చెడిపోవాలని కోరుకోకూడదు అని చంద్రబాబు పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version