నేడు దిల్లీకి చంద్రబాబు.. రేపు ప్రధాని మోదీతో భేటీ

-

ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి చంద్రబాబు నాయుడు ఇవాళ దిల్లీకి వెళ్లనున్నారు. ఈరోజు రాత్రి హస్తిన చేరుకోనున్న ఆయన ఈ పర్యటనలో ప్రధాని మోదీని కలవనున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన బడ్జెట్ ప్రతిపాదనలపై గురువారం ప్రధాని మోదీ, కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తదితరులతో చర్చలు జరపనున్నట్లు సమాచారం. త్వరలో కేంద్రం ప్రవేశ పెట్టబోయే బడ్జెట్‌లో ఏపీకి కేటాయింపులు, కేంద్ర పథకాల ద్వారా రాష్ట్రానికి గతంలో రావాల్సిన నిధులు, కొత్తగా తెచ్చుకోవాల్సిన పథకాలపై ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో చంద్రబాబు చర్చించే అవకాశాలు ఉన్నట్లు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది.

ఏపీకి కీలక ప్రాజెక్టులు, నిధుల సమీకరణ, పెండింగ్ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా సీఎం దిల్లీ పర్యటన కొనసాగనుందని ప్రభుత్వ వర్గాల సమాచారం. గత ఐదేళ్ల కాలంలో వ్యవస్థల విధ్వంసం వల్ల ఏపీ ఏ విధంగా నష్టపోయిందోననే అంశాన్ని ప్రధాని సహా కేంద్ర మంత్రులకు సీఎం వివరించనున్నారు. పోలవరం, రాజధాని అమరావతి నగర నిర్మాణం సహా రాష్ట్రంలో పెండింగ్ ప్రాజెక్టులు తదితర అంశాలపై కేంద్రంలోని ఎన్డీఏ నాయకులతో చంద్రబాబు చర్చించనున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version