శ్రీకాకుళం జిల్లా సిగలపుట్టుగలో ఎలుగు బంట్ల హల్ చల్ చేస్తున్నాయి. శ్రీకాకుళం జిల్లా మందస మండలం సిగలపుట్టుగ సముద్ర తీరంలో ఎలుగుబంట్లు జలకాలాడాయి. సముద్ర తీరంలో ఎలుగుబంట్లు హల్ చల్ చేస్తుండటంతో మత్స్యకారులు, సందర్శకులు భయంతో పరుగులు తీశారు.
ఇటీవల కాలంలో ఎలుగుబంట్లు మనుషులపై దాడులకు తెగబడుతున్న నేపథ్యంలో ఏ వైపు నుంచి వచ్చి భల్లూకాలు ఎటాక్ చేస్తాయోనన్న భయాందోళనలు స్థానికుల్లో నెలకొన్నాయి. ఎలుగుబంట్లు సంచారం పై కాశీబుగ్గ అటవీశాఖ అధికారులకు స్థానికులు సమాచారమిచ్చారు. ప్రమాదం జరగక ముందే చర్యలు తీసుకోవాలని ఫారెస్ట్ అధికారులకు స్థానికులు విజ్ఞప్తి చేశారు. ఇక శ్రీకాకుళం జిల్లా సిగలపుట్టుగలో ఎలుగు బంట్ల హల్ చల్ చేయడంపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.