ఇప్పటికే దరఖాస్తు చేసుకుంటే.. మెగా డీఎస్సీకి ఫీజు మినహాయింపు

-

గత ఎన్నికల ముందు ప్రకటించిన డీఎస్సీకి దరఖాస్తు చేసిన వారికి మెగా డీఎస్సీలో ఫీజు మినహాయింపు ఉంటుందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ అన్నారు. ఎలాంటి విమర్శలకు తావులేకుండా మెగా డీఎస్సీని పకడ్బందీగా నిర్వహిస్తామని తెలిపారు. ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్‌), డీఎస్సీ నిర్వహణపై అధికారులతో సమీక్షించిన ఆయన మెగా డీఎస్సీ, టెట్‌కు మధ్య ఎక్కువ సమయం ఉండాలని అభ్యర్థుల నుంచి విజ్ఞప్తులు వస్తున్నాయని చెప్పారు. ఈ క్రమంలో డీఎస్సీ ఎప్పుడు నిర్వహించాలనే అంశంపై అభ్యర్థులు, విద్యార్థి, యువజన సంఘాల నుంచి అభిప్రాయాలు సేకరించాలని అధికారులను ఆదేశించారు.

“మెగా డీఎస్సీలో వయోపరిమితి సడలింపుపై చర్చించి తగు నిర్ణయం తీసుకుంటాం. మెగా డీఎస్సీలో కొన్ని జిల్లాలకు ఎస్జీటీ పోస్టులు తక్కువగా ఉన్నాయని పలువురు నా దృష్టికి తెచ్చారు. అనంతపురం, శ్రీకాకుళం, నెల్లూరు జిల్లాల్లో న్యాయపరమైన వివాదాలను పరిష్కరించి పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోవాలి. పాఠశాలలో మధ్యాహ్న భోజన మెనూ ఎలా ఉండాలో తల్లిదండ్రుల నుంచి అభిప్రాయాలు సేకరించాలి. ప్రైవేటు పాఠశాల అనుమతుల రెన్యువల్‌ విషయంలో అనవసర ఆంక్షలు విధించవద్దు.” అని మంత్రి నారా లోకేశ్ అధికారులను ఆదేశించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version