ఇకపై ఏపీలో డ్రోన్లు వాడతాం..చంద్రబాబు సంచలన ప్రకటన !

-

ఏపీలో చెత్త పన్ను రద్దు అయింది. ఏపీలో ఎక్కడా చెత్త పన్ను వసూలు చేయొద్దు అంటూ అధికారులను ఆదేశించారు సీఎం చంద్రబాబు నాయుడు. నేను చేసిన పనికి గుర్తింపు లభించింది.. అదే నాకు కిక్ అన్నారు. అనంతపురంలో రథం తగులబెట్టి నెపం మన మీద నెట్టే ప్రయత్నం చేశారని… రామతీర్ధంలో రాముడి తల తీసేస్తే ఎంక్వైరీ లేదని ఆగ్రహించారు.

CM Chandrababu Naidu ordered the officials not to collect garbage tax anywhere in AP

మూడు సింహాలు దొంగిలిస్తే విచారణ లేదు….ఇకపై నేరాల కట్టడికి డ్రోన్లు ఉపయోగిస్తామని హెచ్చరించారు. నేరస్తుల ఆటకట్టిస్తామని వార్నింగ్‌ ఇచ్చారు. ప్రజలకు, రైతులకు సేవలందించడానికి డ్రోన్ల వినియోగం ఉంటుందని తెలిపారు. ప్రతి ఒక్క ఇంటికీ కరెంట్, గ్యాస్ ఇస్తామని వెల్లడించారు. మనం చేసిన పనులను అప్పుడప్పుడు మరిచిపోతున్నారు.. అందుకే కష్టాలు వస్తున్నాయి…టీడీపీ చేసిన పనలను మరిచిపోయినప్పుడల్లా భూతం వస్తోంది.. ఇబ్బందులు వస్తున్నాయని తెలిపారు. దీపావళీ నుంచి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని ప్రకటించారు చంద్రబాబు నాయుడు.

 

Read more RELATED
Recommended to you

Latest news