కృష్ణమ్మకు సీఎం చంద్రబాబు జలహారతి ఇచ్చారు. సీఎం చంద్రబాబు నాయుడు చిత్తూరు జిల్లా కుప్పంలో పర్యటిస్తున్నారు. పరమ సముద్రంలోని కుప్పం బ్రాంచ్ కెనాల్ వద్ద ఆయన కృష్ణ జలాలకు జలహారతి ఇచ్చారు. వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య కృష్ణమ్మకు పసుపు – కుంకుమ, చీర సారెలను అందించారు.

అక్కడే పైలాన్ ను ఆవిష్కరించారు. కాగా, ఇక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో చంద్రబాబు నాయుడు స్వయంగా పాల్గొననున్నారు. ఆ సమావేశాలలో వివిధ కంపెనీలతో MOU చేసుకోనున్నారు.