ప్రధాని నరేంద్ర మోడీ జపాన్ పర్యటనను పూర్తి చేసుకున్నారు. జపాన్ నుంచి నేరుగా మోడీ చైనాకు బయలుదేరారు. టియాన్ జిన్ లో జరగనున్న షాంగై సహకార సంస్థ శిఖరాగ్ర సమావేశంలో మోడీ పాల్గొననున్నారు. ఆగస్టు 31, సెప్టెంబర్ 1 తేదీలలో ఆయన చైనాలో పర్యటిస్తారు.

ఆ దేశ అధ్యక్షుడు జిన్ పింగ్, ప్రధాని మోడీ మధ్య ప్రత్యేక సమావేశం జరుగుతుంది. భారత్ పై అమెరికా విధించిన ప్రతికార సుంకాల నేపథ్యంలో ఈ భేటీపై సర్వత్ర ఉత్కంఠ నెలకొంది. అయితే మోడీ చైనాకు వెళ్లడంతో గ్రాండ్ వెల్కమ్ లభించింది.