ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పై టాలీవుడ్ స్టార్ హీరో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు అల్లు అర్జున్. నిన్నటి రోజున అల్లు అర్జున్ నానమ్మ కనకరత్నమ్మ మరణించిన సంగతి తెలిసిందే.

ఆమె మృతి నేపథ్యంలో చాలామంది ప్రముఖులు సంతాపం తెలిపారు. ఇందులో భాగంగానే వైయస్ జగన్మోహన్ రెడ్డి కూడా సంతాపం తెలిపారు. ఈ మేరకు సోషల్ మీడియాలో కూడా పోస్ట్ పెట్టారు. కనక రత్నమ్మ గారు మృతి చెందడం చాలా బాధాకరం… ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని జగన్మోహన్ రెడ్డి పోస్ట్ పెట్టారు. అల్లు అర్జున్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నట్లు వెల్లడించారు. అయితే వైయస్ జగన్మోహన్ రెడ్డి చేసిన పోస్ట్ పై అల్లు అర్జున్ స్పందించారు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాటలకు తమ కుటుంబానికి ఎంతో మనోధైర్యాన్ని ఇచ్చాయని వెల్లడించారు. తమ కుటుంబం విషాదంలో ఉన్నప్పుడు స్పందించినందుకు జగన్మోహన్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్పారు.