ఒకే చట్టం పరిధిలోకి అన్ని విశ్వవిద్యాలయాలు : సీఎం చంద్రబాబు

-

ఉన్నత విద్యాశాఖపై సీఎం చంద్రబాబు నిర్వహించిన సమీక్షలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రభుత్వ యూనివర్సిటీల బలోపేతం.. పోస్టుల భర్తీ, ప్రమాణాల పెంచేలా చర్యలు తీసుకోవాలి. ఇకపై ఒకే చట్టం పరిధిలోకి అన్ని విశ్వవిద్యాలయాలు తీసుకు రావాలి అని తెలిపారు. బోర్డ్ ఆఫ్ గవర్నెన్స్ ఛైర్ పర్సన్స్ గా ప్రముఖ పారిశ్రామికవేత్తలను నియమించేందుకు ప్రతిపాదనలు పంపాలి. పీపీపీ విధానంలో ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ యూనివర్సిటీ ఏర్పాటు చెయ్యాలి. రాజధాని నవనగరాల్లో భాగంగా అమరావతిలో స్పోర్ట్స్ విలేజ్ ఉండాలి.

ఇక వచ్చే ఏడాది నుంచి కరిక్యులం మార్పునకు నిపుణులతో కమిటీ వేయాలి. రాజకీయ జోక్యం లేకుండా పారదర్శకతతో వీసీల ఎంపిక జరుపుతున్నాం. విశ్వవిద్యాలయాల ర్యాంకింగ్ కు 5 ఏళ్ల యాక్షన్ ప్లాన్ సిద్దం చేయాలి. గత ప్రభుత్వ అసమర్థ విధానాలు, ఉన్నత విద్యా రంగంపై చిన్న చూపు కారణంగా హయ్యర్ ఎడ్యుకేషన్ సెక్టార్ గాడి తప్పింది. ఉన్నత విద్యారంగాన్ని తిరిగి పట్టాలెక్కించి, మంచి ఫలితాలు సాధించేందుకు స్వల్పకాలిక, దీర్ఘ కాలిక కార్యక్రమాలు చేపట్టాలి. ప్రభుత్వ యూనివర్సిటీల బలోపేతంపై తక్షణం దృష్టిపెట్టాలి. ప్రైవేటు, ప్రభుత్వ యూనివర్సిటీల బలోపేతం.. అదే సమయంలో జాతీయ, అంతర్జాతీయ స్థాయి ప్రైవేటు యూనివర్సిటీలకు ప్రోత్సాహం ఇవ్వాలి అని చంద్రబాబు పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news