ఏపీలో సీ ప్లేన్‌ టూరిజం సేవలు ప్రారంభించిన సీఎం చంద్రబాబు

-

ఏపీలో సీ ప్లేన్‌ టూరిజం సేవలు ప్రారంభం అయ్యాయి.. విజయవాడ పున్నమి ఘాట్‌లో ప్రారంభించారు సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు. నదిపై సీ ప్లేన్‌ ల్యాండింగ్‌తో పాటు టేకాఫ్.. సీ ప్లేన్‌లో విజయవాడ నుంచి శ్రీశైలానికి చంద్రబాబు, రామ్మోహన్‌ పయనం అయ్యారు.

CM Chandrababu to Travel in Sea Plane From Vijayawada to Srisailam

ఇక ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు కీలక ప్రకటన చేశారు. సామాన్యులకు అందుబాటు ధరల్లో సీ ప్లేన్‌ ప్రయాణం ఉంటుందని తెలిపారు కేంద్రమంత్రి రామ్మోహన్‌. సీ ప్లేన్ ఆపరేషన్స్ కు కేవలం రాష్ట్రాన్నే కాదు దేశ గతి నే మార్చే శక్తి ఉందని వివరించారు. చంద్రబాబు సూచన మేరకే పాలసీ లో కొన్ని మార్పులు చేసి అందుబాటులోకి తెచ్చామన్నారు. చంద్రుడు మన ముఖ్యమంత్రిగా ఉన్నంత వరకు నిత్య పున్నమి ఉంటుందని పున్నమి ఘాట్ సాక్షిగా చెబుతున్నా అని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version