ఏపీలోని గుంటూరు జిల్లాలో పోలీసువ్యవస్థ గాడి తప్పిందని పెద్ద ఎత్తున ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఓ కేసులో అరెస్టు అయిన వైసీపీ లీడర్ బోరుగడ్డ అనిల్‌కు పోలీసులు రాచమర్యాదలు చేస్తున్న దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. మొన్న రాజమండ్రిలో బోరుగడ్డ అనిల్‌కు పోలీసులు హోటల్‌లో బిర్యానీ పెట్టించిన విషయం తెలిసిందే. అంతకముందు నుంచే పోలీస్ స్టేషన్లో అతనికి సపర్యాలు చేశారు.
బోరుగడ్డకు సాక్షాత్తు కుర్చీలు వేసి దగ్గరుండి పోలీస్ సిబ్బంది అన్నం వడ్డించడం, కూర్చోవడానికి స్టేషన్లో ఏకంగా రైటర్ సీట్ కేటాయించడం, పడుకోవడానికి ప్రత్యేకంగా బల్ల, దుప్పట్లు, దిండ్లు, వాటర్ బాటిల్స్ సమకూర్చినట్లు తెలుస్తోంది. తాజాగా నా మేన్నల్లుడు వచ్చాడు లోపలికి పంపండి, కూర్చోవడానికి కుర్చీ వేయండి అంటూ బోరుగడ్డ పోలీసులకు హుకుం జారీ చేసినట్లు సమాచారం. సామాన్య నేరస్తుడుని కింద కూర్చోబెట్టి అతనికి దగ్గరలోనే వీవీఐపీ నేరస్తుడికి కుర్చీలు వేసి మరీ మర్యాదలు చేస్తున్న విజువల్స్ బయటకు రావడంతో గుంటూరు పోలీసుల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.